ఈదమ్మ ఆలయంలో సీఎం సతీమణి పూజలు

ఈదమ్మ ఆలయంలో సీఎం సతీమణి పూజలు

వంగూరు, వెలుగు: సంక్రాంతి పండుగ సందర్భంగా సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలోని ఈదమ్మ మాంధాత ఆలయం వద్ద జరిగే రథోత్సవంలో సీఎం సతీమణి గీతారెడ్డి మనుమడితో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ సొంత ఊరిలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. 

ఆమె వెంట రాష్ట్ర వ్యవసాయ కమిషన్  మెంబర్  కేవీఎన్ రెడ్డి, సీఎం సోదరులు తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, సర్పంచ్  మల్లెపాకుల వెంకటయ్య, ఉప సర్పంచ్  ఎనుముల వేమారెడ్డి, మాజీ ఎంపీపీ భీమమ్మ లాలు యాదవ్, లక్ష్మారెడ్డి, చందు, జంగయ్య, కృష్ణయ్య పాల్గొన్నారు.