హైదరాబాద్: బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) ఎన్నికల్లో కొత్త ట్విస్ట్. బాయ్ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ పడతాడని అనుకున్న నేషనల్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఉపాధ్యక్ష పదవి రేసులో నిలిచాడు. ఈ పోస్టు కోసం గోపీ నామినేషన్ సమర్పించాడు. జూనియర్ కోచ్ సంజయ్ మిశ్రా ప్రధాన కార్యదర్శి బరిలో ఉన్నాడు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో సభ్యుడు కాకపోవడంతో గోపీచంద్ ప్రధాన కార్యదర్శికి నామినేషన్ వేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో 12 మంది ఉపాధ్యక్షుల్లో ఒకడిగా గోపీ ఎంపికవనున్నాడు. అలాగే, హిమంత బిశ్వ శర్మ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా తిరిగి ఎన్నికవనున్నారు.

