గాంధీ హాస్పిటల్​లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ట్రీట్​మెంట్

 గాంధీ హాస్పిటల్​లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ట్రీట్​మెంట్

పద్మారావునగర్, వెలుగు: పుట్టుకతోనే వినికిడి సమస్యలున్న మూడేళ్లలోపు చిన్నారులకు శాశ్వత పరిష్కారంగా గాంధీ హాస్పిటల్​లో కాక్లియర్ ​ఇంప్లాంట్ ​సర్జరీలు చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్​లో రూ.15 లక్షల ఖరీదైన ఈ  ట్రీట్ మెంట్​ను ఆరోగ్య శ్రీ కింద  గాంధీ ఈఎన్టీ విభాగంలో ఉచితంగానే చేస్తున్నట్లు డిప్యూడీ సూపరింటెండెంట్, ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్​ ప్రొఫెసర్ ​ఎ. శోభన్​బాబు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు ముగ్గురు చిన్నారు
లకు విజయవంతంగా ఈ సర్జరీలు చేశామన్నారు. ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, సురక్షితంగా చేసే ఈ సర్జరీలతో చిన్నారులకు వినికిడి సమస్య శాశ్వతంగా తొలగిపోతుందని, మాట్లాడగలరని పేర్కొన్నారు. మూడేండ్లలోపు చిన్నారులెవరికైనా ఇలాంటి సమస్య ఉంటే పేరెంట్స్ ఈ అవకాశాన్ని  వినియోగించుకోవాలని శోభన్​బాబు కోరారు. ఈ సర్జరీ పలు దశల్లో విజయవంతంగా పూర్తిచేసేందుకు 3 నుంచి 6 నెలల సమయం పడుతుందని ఆయన తెలిపారు.