మొయినాబాద్ శివారులో ఫామ్ హౌస్‎లో కోళ్ల పందేలు

 మొయినాబాద్ శివారులో ఫామ్ హౌస్‎లో కోళ్ల పందేలు

చేవెళ్ల, వెలుగు: ఫామ్ హౌస్‎లో గుట్టుగా కోళ్ల పందేలు నిర్వహిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మొయినాబాద్ మండలం బాకారం గ్రామ శివారులోని ఒక ఫార్మ్ హౌజ్‎లో శనివారం రాత్రి గుట్టు చప్పుడు కాకుండా రాజమండ్రికి చెందిన నిర్వాహకుడు దాట్ల కృష్ణంరాజు కోళ్ల పందేలు నిర్వహిస్తున్నట్లు రాజేంద్ర నగర్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే దాడులు చేసి నిర్వాహకుడితో పాటు 14 మందిని అరెస్టు చేశారు. రూ. 60,950 నగదుతో పాటు 4 కార్లు, 13 మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు. 18 కోడి కత్తులు, 22 కోళ్లు స్వాధీనం చేసుకున్నారు.