
అల్వాల్, వెలుగు: అల్వాల్ యతి హౌస్ హోటల్లోని చికెన్ బిర్యానీలో బొద్దింక వచ్చింది. హరీశ్వ్యక్తి శనివారం మధ్యాహ్నం బిర్యానీ తినేందుకు యతి హౌస్‌కు వెళ్లాడు. చికెన్ బిర్యానీ తీసుకుని తింటుండగా బొద్దింక రావడంతో కంగుతిన్నాడు. హోటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తోటి కస్టమర్లతో కలిసి కిచెన్ ను పరిశీలించగా ఫ్రిడ్జ్‌లో గోంగూర పచ్చడి, చికెన్ లెగ్ పీస్‌లు బూజు పట్టి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే విషయాన్ని మీడియాకు తెలిపాడు.