IT layoffs:కాగ్నిజెంట్లో 15 వేల మంది ఔట్!..ఇండియాలోనూ భారీగా తొలగింపులు

 IT layoffs:కాగ్నిజెంట్లో 15 వేల మంది ఔట్!..ఇండియాలోనూ భారీగా తొలగింపులు

న్యూఢిల్లీ: ఐటీ సేవల కంపెనీ కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా 12 వేల నుంచి 15 వేల మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని మనీకంట్రోల్ వార్తాసంస్థ వెల్లడించింది. ఈ ప్రభావం ప్రధానంగా భారత్​లోనే ఎక్కువగా ఉండనుంది. 

ప్రాజెక్ట్ లీప్ పేరుతో చేపట్టిన పునర్వ్యవస్థీకరణ కోసం కంపెనీ 230 మిలియన్ డాలర్లు (రూ.1,916 కోట్లు) నుంచి 320 మిలియన్ డాలర్లు (రూ.2,665 కోట్లు) వరకు పరిహారం కేటాయించింది. మొత్తం 3.57 లక్షల మంది సిబ్బందిలో 2.5 లక్షల మందికి పైగా భారత్​లోనే పనిచేస్తున్నారు.  

గతేడాది టీసీఎస్ 12 వేల మందిని తొలగించగా, హెచ్​సీఎల్​టెక్, ఒరాకిల్ వంటి సంస్థలు కూడా ఇదే బాటలో నడిచాయి. కస్టమర్ల ప్రాధాన్యతలు మారుతుండటంతో ఖర్చుల తగ్గింపు కోసం ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.