మళ్లీ పెరిగిన చలి..14 జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు

మళ్లీ పెరిగిన చలి..14  జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు
  •  
  • అత్యల్పంగా సంగారెడ్డి జిల్లాలో 5.6 డిగ్రీల ఉష్ణోగ్రత
  • రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందన్న అధికారులు
  • 14 జిల్లాల్లో సింగిల్​ డిజిట్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. రెండు మూడు రోజులుగా రాత్రి టెంపరేచర్లు సింగిల్​ డిజిట్​లో నమోదవుతున్నాయి.  బుధ, గురువారాల్లో చలి పీక్స్​కు వెళ్లింది. పలు చోట్ల 5 డిగ్రీల రేంజ్​లో రాత్రి టెంపరేచర్లు నమోదవుతున్నాయి. గురువారం రాత్రి14 జిల్లాల్లో సింగిల్​ డిజిట్​ టెంపరేచర్లు నమోదయ్యాయి. అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహీర్​లో 5.6 డిగ్రీల టెంపరేచర్​ రికార్డయింది. 

ఆసిఫాబాద్​ జిల్లా గిన్నెదారిలో 6 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా యూనివర్సిటీ ఆఫ్​ హైదరాబాద్​లో 7.4, కామారెడ్డి జిల్లా జుక్కల్​లో 8.1, వికారాబాద్​ జిల్లా మర్పల్లిలో 8.2, ఆదిలాబాద్​ జిల్లా అర్లిటిలో 8.3, మేడ్చల్ జిల్లా మౌలాలిలో 8.8 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో ఏడు జిల్లాల్లో 9 ఉంచి 9.8 డిగ్రీల మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకో 19 జిల్లాల్లో 10 నుంచి 12.4 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి. ఇందులో 12 జిల్లాల్లో 10 డిగ్రీల రేంజ్​లోనే టెంపరేచర్లు నమోదయ్యాయి.