ఆన్ లైన్ ఎంట్రీలో తప్పులు రావొద్దు : కలెక్టర్ అనుదీప్

ఆన్ లైన్ ఎంట్రీలో తప్పులు రావొద్దు : కలెక్టర్ అనుదీప్
  •     హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్
  •     ప్రజాపాలన దరఖాస్తుల​ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఆదేశం

హైదరాబాద్​, వెలుగు : ప్రజా పాలనలో స్వీకరించిన దరఖాస్తుల్లోని డేటాను ఎలాంటి తప్పులు లేకుండా ఆన్ లైన్ లో నమోదు చేయాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. ఆదివారం కలెక్టర్  సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఆఫీసు, మలక్​పేట్​పరిధి ఆజంనగర్ కమ్యూనిటీ హాల్​ లో  ఏర్పాటుచేసిన డేటా ఎంట్రీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎంట్రీ ఆపరేటర్లు ఆన్​లైన్​ఆధార్

రేషన్ కార్డుల వివరాలు తప్పనిసరిగా నమోదయ్యేలా చూసుకోవాలని సూచించారు. అలాగే ప్రతి కాలంను క్షుణ్ణంగా పరిశీలించి తప్పులు లేకుండా నమోదు చేయాల్సిందిగా ఆదేశించారు. సికింద్రాబాద్ ఆర్డీవో రవికుమార్, అధికారులు ఉన్నారు. జీహెచ్ఎంసీ  స్వీకరించిన  ప్రజా పాలన దరఖాస్తులను ఆన్ లైన్ లో  ఎంట్రీ చేస్తున్నారు.  30 సర్కిళ్లలో 1700 మంది సిబ్బందితో  24 లక్షల74వేలకు పైగా దరఖాస్తులు ఆన్ లైన్​ లో ఎంట్రీ  చేయిస్తున్నారు.