కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ జిల్లాలో జాతీయ రహదారి 563 నిర్మాణాన్ని వెంటనే పూర్తిచేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. ఎన్‌హెచ్ఏఐ వరంగల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ భరద్వాజ్, ఆర్డీవో మహేశ్వర్, అధికారులతో కలెక్టరేట్‌లో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పీడీ భరద్వాజ్ పలు విషయాలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వరంగల్ నుంచి కరీంనగర్ వరకు 89 శాతం పనులు పూర్తయ్యాయని, జూలై 31 లోగా నిర్మాణం పూర్తి చేసేందుకు టార్గెట్‌గా నిర్దేశించుకున్నట్లు చెప్పారు.
అనంతరం కొత్తపల్లి– -చిగురుమామిడి, చిగురుమామిడి– హుస్నాబాద్ ఫోర్ లేన్ రోడ్ల పురోగతిపై ఆర్‌అండ్‌బీ అధికారులతో కలెక్టర్ రివ్యూ చేశారు. అంతకుముందు కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో పాల్గొన్నారు. వృద్ధులు, దివ్యాంగుల వద్దకు కలెక్టర్ స్వయంగా వెళ్లి దరఖాస్తులను స్వీకరించారు. బల్దియాలో నిర్వహించిన ప్రజావాణిలో మేయర్ కొలగాని శ్రీనివాస్, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అర్జీలు స్వీకరించారు.
తిమ్మాపూర్, వెలుగు: తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలికల స్కూల్‌ను కలెక్టర్ చిత్రా మిశ్రా సోమవారం పరిశీలించారు. స్కూల్‌లో రికార్డులను పరిశీలించారు. కిచెన్‌లో ఆహార పదార్థాలను నాణ్యతను చెక్ చేశారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా..? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
