ప్రైవేటుకు దీటుగా వైద్య సేవలందించాలి : కలెక్టర్‌‌‌‌‌‌‌‌ చిత్రా మిశ్రా

ప్రైవేటుకు దీటుగా వైద్య సేవలందించాలి : కలెక్టర్‌‌‌‌‌‌‌‌ చిత్రా మిశ్రా

కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రైవేట్‌‌‌‌కు దీటుగా వైద్య సిబ్బంది సేవలందించి, ప్రజల మన్ననలు పొందాలని కరీంనగర్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్‌‌‌‌లోని హుస్సేన్‌‌‌‌పురా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్(ముంతాజ్ ఖానా)ను  కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెల్త్ సెంటర్‌‌‌‌లో అందుతున్న వైద్య సేవలపై రివ్యూ చేశారు. 

తిమ్మాపూర్, వెలుగు: తిమ్మాపూర్ మండలంలోని అల్గునూర్, నల్లగొండ గ్రామాల్లోని ప్రభుత్వ స్థలాలను కలెక్టర్ చిత్రా మిశ్రా, మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ పరిశీలించారు. స్థలాలు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలిప్పించడమే కాకుండా వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతోనే ఈ స్థలాలను పరిశీలించినట్లు తెలుస్తోంది.