ఇయ్యాల తూంకుంట మున్సిపల్ లోఅవిశ్వాస తీర్మానం

ఇయ్యాల తూంకుంట మున్సిపల్ లోఅవిశ్వాస తీర్మానం

శామీర్ పేట, వెలుగు : మేడ్చల్ జిల్లాలో అవిశ్వాస తీర్మానాల జోరు కొనసాగుతుంది.  కాగా.. శామీర్ పేట మండలం తూముకుంట మున్సిపాలిటీలో 16 మంది కౌన్సిలర్లు ఉండగా 11 మందితో గ్రూప్ గా  ఏర్పడ్డారు. ఈనెల 5న  చైర్మన్, వైస్ చైర్మన్ కు వ్యతిరేకంగా11 మంది సంతకాలు చేసిన అవిశ్వాస తీర్మాన పత్రాన్ని జిల్లా కలెక్టర్ కు  అందజేశారు.

పరిశీలించిన కలెక్టర్ గౌతమ్ ఈనెల 22న అవిశ్వాసంపై  ఓటింగ్ తేదీ ఖరారు చేశారు. గురువారం ఉదయం ఉదయం 11 గంటల సమయంలో తూంకుంట మున్సిపాలిటీలో ప్రొసీడింగ్ ఆఫీసర్ ఎదుట బలపరీక్ష నిరూపించుకోవలసి ఉంది.  అవిశ్వాసం అందజేసిన 11 మంది కౌన్సిలర్లు క్యాంపులో ఉన్నారు.  నేరుగా ఓటింగ్ కు రానున్నారు.