సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రతి ఒక్కరూ ఆయుష్ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్హైమావతి సూచించారు. శుక్రవారం సిద్దిపేట కలెక్టరేట్ లో ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయుష్ కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్, ఫార్మాసిస్ట్ వెకెన్సీ లిస్ట్ తయారుచేయాలని, జిల్లాలో నిర్మించిన యోగా షెడ్లలో యోగా టీచర్లు సేవలందించాలని సూచించారు.
ఆయుర్వేద, యునాని, హోమియో పతి వైద్యం వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించాలని, ఆయుష్ సేవలను విస్తరించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ధనరాజ్, జిల్లా ఆయుష్ ప్రోగ్రామ్ మేనేజర్ భాను తేజ, జిల్లా ఆయుష్ ఇన్చార్జి అధికారి ఉమాదేవి, ఆయుష్ డాక్టర్లు పాల్గొన్నారు
