విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి : కలెక్టర్ హైమావతి

విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి : కలెక్టర్ హైమావతి
  •     కలెక్టర్ హైమావతి 

గజ్వేల్, వెలుగు: గురుకుల విద్యాలయాలు, కాలేజీల్లో విద్యార్థులకు నాణ్యమైన వసతి, భోజనం, సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్​ హైమావతి సూచించారు. బుధవారం ఆమె గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపల్​ పరిధిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల స్కూల్, జూనియర్ కాలేజీ, బాలికల గురుకుల స్కూల్​, జూనియర్ కాలేజీని ఆకస్మికంగా సందర్శించారు. 

ఈ సందర్భంగా కిచెన్​లోకి వెళ్లి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజనాన్ని మెనూ ప్రకారం చేయాలని ఇష్టానుసారం చేస్తే సహించేది లేదన్నారు. పరిశుభ్రతను పాటించాలని పారిశుధ్య సిబ్బందిపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాట్లాడుతూ.. క్రమశిక్షణతో ఉండాలని సూచించారు.  గురుకుల విద్యాలయాల్లో కామన్​మెనూ పాటించని, పరిశుభ్రంగా ఉంచని వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారి కి ఫోన్ ద్వారా ఆదేశించారు. 

 కలెక్టర్​ చేతుల మీదుగా చెక్కు పంపిణీ

చేర్యాల: మండలంలోని వేచరేణి పంచాయతీ సిబ్బంది ఎండీ మోహిన్ పాషా ఈ ఏడాది ఆగష్టు 14న  విద్యుత్ షాక్ తగిలి మరణించడంతో ఆయన కుటుంబానికి కలెక్టర్​ హైమావతి రూ. 15 లక్షల చెక్కును బుధవారం అందజేశారు. 

కార్యక్రమంలో డీపీవో రవీందర్, హనుమంతు, జనగామ పోస్టల్​బ్రాంచ్ సీనియర్  మేనేజర్ జేఎల్​ సింగ్, మేనేజర్ రమేశ్, భిక్షపతి, చేర్యాల సబ్ పోస్ట్ మాస్టర్ ప్రసాద్ బాబు , బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ నరసింహులు, పంచాయతీ సర్పంచ్ వెంకటలక్ష్మి దుర్గా రెడ్డి, ఉప సర్పంచ్ నవీన్, వార్డు సభ్యులు, సెక్రటరి రాజు పాల్గొన్నారు