ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్ హైమావతి

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్ హైమావతి

సిద్దిపేట టౌన్, వెలుగు: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి ప్రజల నుంచి 132 వినతులను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ..ప్రజలు అందజేసిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, ఏఓ రాజ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. 

టీజీ  ఐపాస్ లో వివిధ పరిశ్రమలు నెలకొల్పడానికి దరఖాస్తు పెట్టుకున్న అన్ని ఆయా డిపార్ట్​మెంట్స్​వారీగా వెరిఫై చేయాలని సూచించారు. ఒకవేళ యూనిట్ నెలకొల్పడానికి సుముఖంగా లేకపోతే డిలిట్ చేయాలని ఆదేశించారు. అంతకుముందు ప్రభుత్వ గురుకుల విద్యాలయాల పోస్టర్ ను విడుదల చేశారు. స్టూడెంట్స్​ఆన్​లైన్​లో మాత్రమే అప్లై చేసుకోవాలని సూచించారు.  జిల్లా పరిశ్రమల శాఖ అధికారి గణేశ్ రామ్, ఎల్డీఎం హరిబాబు పాల్గొన్నారు.

 ప్రజావాణికి 39 అర్జీలు

సంగారెడ్డి టౌన్: సమస్యల పరిష్కారానికి చక్కటి వేదిక ప్రజావాణి అని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్​లో అధికారులతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా భూ సమస్యలు, పింఛన్లు, ఉద్యోగ కల్పన, పంచాయతీ రాజ్, ఇంజనీరింగ్, విద్యుత్, వ్యవసాయ, హార్టికల్చర్, విద్య, హౌసింగ్, లేబర్, పీడబ్ల్యూడీ, మిషన్ భగీరథ, మున్సిపల్, పోలీస్, మైనార్టీ వెల్ఫేర్లకు సంబంధించి పలు ఫిర్యాదులను స్వీకరించారు. 

జిల్లా వ్యాప్తంగా 39 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్​చెప్పారు. సంబంధిత శాఖల అధికారులు దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోలు పాల్గొన్నారు.

 ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి

మెదక్: కలెక్టరేట్ లో ప్రతీ సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మెదక్ కలెక్టరేట్​లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 64  అర్జీలు రాగా అందులో భూ భారతి 21, ఇందిరమ్మ ఇండ్లు 11, పెన్షన్ కోసం12, ఇతర సమస్యలు 20 ఉన్నాయి. ప్రజావాణికి వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్​ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ శ్రీనివాసరావు, డీఆర్ఓ భుజంగరావు పాల్గొన్నారు.