కోహెడ, వెలుగు: ధాన్యం గ్రేడింగ్ సమస్యను పరిష్కరించాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతిని రైతులు కోరారు. శుక్రవారం రాత్రి కోహెడ మండలం శనిగరం ఐకేపీ సెంటర్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ గ్రేడింగ్ సమస్యతో మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఆమె మాట్లాడుతూ అగ్రికల్చర్అధికారులు వచ్చి ధాన్యం పరిశీలన చేసి గ్రేడ్ కేటాయించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
అకాల వర్షాలు పడే అవకాశం ఉందని, రైతులు రాత్రి వేళలో వడ్ల కుప్పలపై టార్పాలిన్ కవర్లు కప్పి ఉంచాలని సూచించారు. అంతకుముందు సివిల్ సప్లై డీఎం గోపి కృష్ణ శనిగరం, కోహెడ సెంటర్లను విజిట్ చేశారు. కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారి శ్రీనివాస్, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ విద్యాసాగర్, ఏపీఎం శ్రీనివాస్ గౌడ్, సీసీలు సంపత్, రాజమౌళి, శ్రీనివాస్, సుల్తానా పాల్గొన్నారు.

