వర్ని, వెలుగు: నిజామాబాద్జిల్లా వర్ని మండలం కోటయ్య క్యాంపులోని కేజీబీవీని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సందర్శించారు. క్లాస్‌రూమ్‌లను పరిశీలించారు. మెనూ వివరాలు అడిగి తెలుసుకొని ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. స్కూల్ పరిసరాలు, పరిశుభ్రత పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు.
అనంతరం 7వ తరగతి గదిని సందర్శించి విద్యార్థినులకు ప్రశ్నలు వేస్తూ వారి అభ్యాసన సామర్థ్యాన్ని పరిశీలించారు. తన వెంట తెచ్చిన డైరీలు, చాక్లెట్లు, బహుమతులు అందించారు. లక్ష్యాలు పెట్టుకొని చదువుకోవాలని, వ్యక్తిగత భద్రత పాటించాలన్నారు. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ధైర్యంగా అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. స్కూల్కొత్త భవన నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించారు. కలెక్టర్‌వెంట తహసీల్దార్ సాయిలు తదితరులున్నారు.
