ఎలక్టోరల్ మ్యాపింగ్ పూర్తి చేయండి : కలెక్టర్ కె.హైమావతి

ఎలక్టోరల్ మ్యాపింగ్ పూర్తి చేయండి : కలెక్టర్ కె.హైమావతి

గజ్వేల్, వెలుగు: గజ్వేల్​మున్సిపాలిటీ పరిధిలో ఎలక్టోరల్ మ్యాపింగ్ పూర్తి చేయాలని కలెక్టర్ కె.హైమావతి బీఎల్​వోలను ఆదేశించారు. మున్సిపల్ ఆఫీస్​లో చేపడుతున్న ఎలక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియను బుధవారం ఆమె పరిశీలించారు. వార్డుల వారీగా బిల్ కలెక్టర్లు, సూపర్‌వైజర్లు, బీఎల్ వోలు సమన్వయంతో పని చేయాలన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రెండుచోట్ల ఓటు ఉన్న వారిని గుర్తించి, ఒక ప్రాంతంలో మాత్రమే ఓటుహక్కు కల్పించాలని చెప్పారు. 

మ్యాపింగ్ వివరాలను ప్రతీరోజు అప్​లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ బాలకిషన్‌ కు సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో అపరిశుభ్ర వాతావరణంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆఫీస్​ను శుభ్రంగా ఉంచాలని, అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. అనంతరం పిడ్జెట్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను తనిఖీ చేసి, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలని టీచర్లకు సూచించారు.