మక్తల్(నారాయణ పేట), వెలుగు: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో నిర్వహించిన రోడ్ సేఫ్టీ సమావేశంలో ఎస్పీ వినీత్ తో కలిసి మాట్లాడారు. నెల రోజుల్లో బ్లాక్ స్పాట్స్వద్ద ప్రమాదాలను అరికట్టాలన్నారు. డీఎస్పీ లింగయ్య మాట్లాడుతూ.. జిల్లాలోని10 బ్లాక్ స్పాట్స్ వద్ద బారికేడ్లు, స్పీడ్బ్రేకర్లు ఏర్పాటు చేస్తామన్నారు.
రోడ్లకు ఇరువైపులా ఉన్న పాఠశాలల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసుకునేలా ఆయా పాఠశాలల యాజమాన్యాలకు ఆదేశాలివ్వాలని డీఈవో గోవిందరాజుకు కలెక్టర్ సూచించారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించేందుకు అంబులెన్స్ లను అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్వో జయచంద్రమోహన్ కు చెప్పారు.
