సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ను సక్సెస్ చేయాలి : కలెక్టర్ ప్రావీణ్య

సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ను సక్సెస్ చేయాలి : కలెక్టర్ ప్రావీణ్య

రామచంద్రాపురం, వెలుగు: అధికారులంతా సమన్వయంతో పనిచేసి సౌత్ ఇండియా సైన్స్​ ఫెయిర్​ను సక్సెస్​చేయాలని కలెక్టర్​ ప్రావీణ్య కోరారు. రామచంద్రాపురం మండలం కొల్లూర్​ గాడియం ఇంటర్నేషనల్ స్కూల్లో ఈనెల 19 నుంచి 23 వరకు నిర్వహించే  ఎస్ఐఎస్ఎఫ్​2026 ఏర్పాట్లను శుక్రవారం ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఈ సైన్స్​ ఫెయిర్​ జిల్లా ప్రతిష్టకు కీలకమైందని అన్ని శాఖల అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు.

 సౌత్​ ఇండియా నలుమూలల నుంచి విద్యార్ధులు, ఉపాధ్యాయులు, గెస్టులు హాజరుకానున్నారని, ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎంట్రన్స్, ఎగ్జిట్ మార్గాలు, ఎగ్జిబిట్ల లిస్టు, విద్యుత్ కనెక్షన్లు, భద్రతా ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. సైన్స్​ ఫెయిర్​లో పాల్గొనే వారికి వసతి, భోజనం, రవాణా, వైద్య సదుపాయాల విషయంలో కమిటీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 అన్ని అంశాల్లో బ్యాక్​ అప్ ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా సమస్యలు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిశీలనలో ఆర్డీఓ రాజేందర్​, జిల్లా సైన్స్​ ఆఫీసర్​ సిద్ధారెడ్డి, నోడల్​ ఆఫీసర్​ లింబాజీ, ఎంఈఓ నాగేశ్వర్​ నాయక్​, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు, కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.