పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్​టౌన్, వెలుగు: పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్​ రాహుల్​ రాజ్​సూచించారు. మంగళవారం తెలంగాణ గణిత ఫోరం మెదక్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 21 మండలాల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన పదో తరగతి విద్యార్థులకు గణిత టాలెంట్ టెస్ట్ నిర్వహించారు.

 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్​ రాహుల్​ రాజ్​మాట్లాడుతూ.చిన్నప్పుడు నిర్వహించిన టాలెంట్ టెస్టులో తాను అప్పటి హైదరాబాద్ కలెక్టర్ చేతుల మీదుగా బహుమతి అందుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. విద్యార్థులు కూడా గణితంతో పాటు అన్ని విషయాల్లో ప్రావీణ్యం సంపాదించాలన్నారు. కార్యక్రమంలో డీఈవో విజయ, జిల్లా ఏసీజీఈ కరుణాకర్, డీఎస్​వో రాజిరెడ్డి, ఎస్ఎస్​ఏ అధికారులు నవీన్, రాజు,  ఎంఈవోలు శంకర్,  మధు మోహన్ , ఉపాధ్యాయ సంఘాల నాయకులు కొండల్ రెడ్డి,  గోపాల్,  నాగరాజు, బాలరాజు, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

విజేతల వివరాలు..

ఇంగ్లీష్ మీడియంలో ప్రథమ బహుమతి రామాయంపేట మండలం కోనాపూర్​కు చెందిన జడ్పీహెచ్​ఎస్​ విద్యార్థి విఘ్నేష్​, ద్వితీయ బహుమతి మాచవరం జడ్పీహెచ్​ఎస్​ విద్యార్థి ఉదయ్ కుమార్, మూడో బహుమతి తేజస్విని సాధించారు. తెలుగు మీడియంలో శివ్వంపేట కేజీబీవీకి చెందిన సక్కుబాయి, ద్వితీయ బహుమతిని టేక్మాల్​ కేజీబీవీ విద్యార్థిని శ్రీచందన, తృతీయ బహుమతిని హవేలీ ఘనపూర్​ మండలం బూర్గుపల్లికి చెందిన సింధూజ దక్కించుకున్నారు.

 ఉర్దూ మీడియంలో మెదక్​లోని బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న జియాబేగం, జువేరియా ఫాతిమా ప్రథమ బహుమతి, రెండో బహుమతి చేగుంట టీజీఎమ్​ఎస్​కు చెందిన ఆదిత్య, మూడో బహుమతిని టీజీఆర్​ఎస్ మెదక్​ విద్యార్థిని రుచిత సాధించారు. కలెక్టర్ విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలను ప్రదానం చేశారు. కార్యక్రమానికి సహకరించిన దాతలు డాక్టర్​ పెంటాగౌడ్​, డాక్టర్​ విజయ్​ కుమార్​, డాక్టర్​ నరేందర్​ రెడ్డిని సన్మానించారు.