పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

రామాయంపేట, వెలుగు: పేదలకు నాణ్యమైన వైద్య సేవలందించాలని కలెక్టర్​రాహుల్​రాజ్​ సూచించారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదివారం ఆయన రామాయంపేట మండలం డి.ధర్మారం గ్రామంలోని బీసీ హాస్టల్ తో పాటు పీహెచ్ సీ తనిఖీ చేశారు. మొదట హాస్టల్ కు వెళ్లి 55 బ్లాంకెట్స్ ను స్టూడెంట్స్ కు  పంపిణీ చేశారు.

 హాస్టల్ పరిసరాలను పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న మౌలిక వసతులు, మెనూ, నిత్యవసర వస్తువుల స్టోర్ రూమ్  పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం హాస్పిటల్ చేరుకుని అక్కడి రికార్డులు పరిశీలించారు. ఔట్ పేషంట్ల వివరాలు అడిగి  తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంఈవో హరిప్రియ, బీసీ హాస్టల్ వార్డెన్ ఉన్నారు.