మెదక్ టౌన్, వెలుగు: విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యం, సృజనాత్మకతను వెలికితీసేందుకే సైన్స్ఫెయిర్నిర్వహిస్తున్నట్లు కలెక్టర్రాహుల్రాజ్ చెప్పారు. గురువారం మెదక్ పట్టణంలోని వెస్లీ హైస్కూల్ లో రెండు రోజుల పాటు జరిగే జిల్లా స్థాయి ఇన్స్పైర్, సైన్స్ఫెయిర్ కార్యక్రమాన్ని కలెక్టర్ రాహుల్రాజ్, డీఈవో విజయ, సైన్స్ ఆఫీసర్ రాజిరెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో గతేడాది నిర్వహించిన సైన్స్ఫెయిర్ ప్రదర్శనలు జాతీయ స్థాయికి ఎంపిక కావడం ఆనందకరమన్నారు. అదే స్ఫూర్తితో ఈ సారి కూడా విద్యార్థులు, ఉపాధ్యాయులు చక్కటి ప్రదర్శనలు నిర్వహించి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని కలెక్టర్ ఆకాంక్షించారు. విద్యార్థులు కేవలం సైన్స్ చదవడమే కాకుండా ప్రాక్టికల్స్చేయాలన్నారు.
స్మార్ట్ ఫోన్లను మంచి పనులకు మాత్రమే ఉపయోగించాలని సూచించారు. డీఈవో విజయ మాట్లాడుతూ.. విద్యార్థులు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కోర్సులను ఎంచుకొని ఉన్నతంగా చదివి స్థిరపడాలని సూచించారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులు, పరికరాలను పరిశీలించారు.
మెదక్ పట్టణంలో త్వరలో సాండ్బజార్
మెదక్ పట్టణంలో త్వరలో సాండ్ బజార్ ఏర్పాటుచేయనున్నట్లు కలెక్టర్ రాహుల్రాజ్చెప్పారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ప్రాంగణంలో స్థలాన్ని పరిశీలించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు త్వరలో ఇసుక సమస్య తీరనుందన్నారు.మెట్రిక్ టన్ను ఇసుక సుమారుగా రూ.1,200 లభిస్తుందని, సాండ్ బజార్లో వెయ్యి టన్నుల ఇసుక స్టాక్ ఉన్నట్లు తెలపారు. ఆయన వెంట అధికారులు సంజయ్ కుమార్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
పదవుల వేలం నిర్వహిస్తే క్రిమినల్ కేసులు
కౌడిపల్లి: ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం ఆదేశాలు పాటించాలని, జిల్లాలో ఎక్కడైనా సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు వేలం వేసినా, పోటీ చేసే అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గురువారం కౌడిపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీసులో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు.
ఆయన మాట్లాడుతూ.. మూడో విడత నామినేషన్ శుక్రవారంతో పూర్తవుతుందని, అధికారులు పత్రాలను పరిశీలించి నామినేషన్ స్వీకరించాలన్నారు. రిజర్వేషన్ అభ్యర్థులకు కుల సర్టిఫికెట్లు త్వరగా ఇవ్వాలని మండల అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.
