మెరుగైన వైద్య సేవలందించాలి : కలెక్టర్ రాహుల్రాజ్

మెరుగైన వైద్య సేవలందించాలి : కలెక్టర్ రాహుల్రాజ్
  • కలెక్టర్ రాహుల్​రాజ్​ 

మెదక్​ టౌన్, వెలుగు: జిల్లాలో ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపడ్డాయని కలెక్టర్​రాహుల్​రాజ్​అన్నారు. బుధవారం ఆయన  చేగుంట మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. పీహెచ్​సీ, పశువైద్యశాల, తహసీల్దార్ ఆఫీసులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. తహసీల్దార్ ఆఫీసులో రికార్డులు భద్రపరచడం, రిజిస్టర్ల నిర్వహణలో సిబ్బందికి అవగాహన అవసరమన్నారు. మండలంలో పశు వైద్య సేవలు విస్తృత పరచాలని సూచించారు. చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి ‌ ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. 

తప్పనిసరిగా సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు వైద్య సేవలు అందించాలని విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పశువైద్యశాలను  సందర్శించి పశువులకు అందుతున్న వైద్య సేవలు, టీకాలు, నిర్వహణ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్,   వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

మెదక్​ చర్చిలో ఫీస్ట్​ సెలబ్రేషన్స్​కు రూ.34 లక్షలు మంజూరు

తెలంగాణ ప్రభుత్వం మెదక్​జిల్లాలోని చర్చిల్లో ఫీస్ట్​సెలబ్రేషన్స్​నిర్వహించడానికి రూ.34 లక్షలు మంజూరు చేసినట్లు కలెక్టర్​ రాహుల్​ రాజ్​చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్​ పండగను పురస్కరించుకొని ఒక్కో నియోజకవర్గానికి రూ.2 లక్షల చొప్పున 2 నియోజకవర్గాలకు రూ.4 లక్షలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. మెదక్​, నర్సాపూర్​ నియోజకవర్గాల్లోని వంద చర్చిలకు ఒక్కో చర్చికి రూ.30 వేల చొప్పున రూ. 30 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.