4826 కోట్లతో క్రెడిట్​ ప్లాన్ : సిక్తా పట్నాయక్

4826 కోట్లతో క్రెడిట్​ ప్లాన్ : సిక్తా పట్నాయక్

హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలోని 29 బ్యాంకులు, 162 శాఖల ద్వారా 2023,-24 సంవత్సరానికి  రూ.4,826.41 కోట్లకు గానూ మొదటి క్వార్టర్​కు రూ.2,268.24 కోట్లు మంజూరు చేసినట్లు కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్​ కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం జిల్లా సంప్రదింపుల కమిటీ మీటింగ్​ జరిగింది. కాగా ప్రాధాన్యం  ప్రకారం వ్యవసాయ రంగానికి  రూ.779 .33  కోట్లు, పరిశ్రమల రంగానికి  రూ.630 .57 కోట్లు, విద్యారుణాలు రూ.2.28 కోట్లు, గృహ నిర్మాణ రంగానికి  రూ.7 .31  కోట్లు, ఇతర ప్రాధాన్య రంగాలకు రూ. 9.58  కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. 

ALSO  READ :-  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దూకుడు .. ఎన్నికల ముందు హడావుడి శంకుస్థాపనలు

పంట రుణమాఫీ 2018 పథకం కింద 96 ,328 రైతులు నమోదుకాగా  41,313  మందికి రుణమాఫీ నగదు అందిందన్నారు. ఈ సమావేశంలో  జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్, నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్, ఆర్బీఐ అధికారి అలీ బాబా, డీఆర్డీవో శ్రీనివాస్​ కుమార్​,  బ్యాంకు ఆఫీసర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.