అన్నిశాఖల సహకారంతోనే ఎలక్షన్స్‌‌‌‌ సక్సెస్‌‌‌‌

అన్నిశాఖల సహకారంతోనే ఎలక్షన్స్‌‌‌‌ సక్సెస్‌‌‌‌

హనుమకొండ, వెలుగు : అన్ని శాఖల సహకారం, సమన్వయంతోనే అసెంబ్లీ ఎన్నికలను సక్సెస్‌‌‌‌ చేసినట్లు కలెక్టర్‌‌‌‌ సిక్తా పట్నాయక్‌‌‌‌ చెప్పారు. హనుమకొండ అంబేద్కర్‌‌‌‌ భవన్‌‌‌‌లో శుక్రవారం నిర్వహించిన సక్సెస్‌‌‌‌ మీట్‌‌‌‌లో ఆమె మాట్లాడారు. పరకాల, వరంగల్‌‌‌‌ వెస్ట్‌‌‌‌ నియోజకవర్గాల్లో ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయడంలో రిటర్నింగ్‌‌‌‌ ఆఫీసర్లు శ్రీనివాస్, రమేశ్‌‌‌‌ ఎంతో కృషి చేశారన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు సహకరించిన పోలీసులకు థ్యాంక్స్‌‌‌‌ చెప్పారు.

అనంతరం సీపీ అంబర్‌‌‌‌ కిశోర్‌‌‌‌ ఝా మాట్లాడుతూ ఎన్నికలను విజయవంతం చేయడంలో వివిధ డిపార్ట్‌‌‌‌మెంట్ల ఆఫీసర్లు, సిబ్బంది ముఖ్య పాత్ర పోషించారన్నారు. ఎక్కడా చిన్న సమస్య కూడా తలెత్తకుండా సమష్టిగా పని చేశారని కొనియాడారు. సమావేశంలో అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ మహేందర్‌‌‌‌, వరంగల్‌‌‌‌ సెంట్రల్‌‌‌‌ జోన్‌‌‌‌ డీసీపీ ఎంఏ. బారీ, ఆర్డీవోలు శ్రీనివాస్, రమేశ్‌‌‌‌, డీఆర్డీవో శ్రీనివాస్‌‌‌‌కుమార్‌‌‌‌, హనుమకొండ ఏసీపీ కిరణ్‌‌‌‌కుమార్‌‌‌‌, డీఈవో అబ్దుల్‌‌‌‌ పాల్గొన్నారు.