సమస్యలు రాకుండా  ఎన్నికలు నిర్వహించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

సమస్యలు రాకుండా  ఎన్నికలు నిర్వహించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
  • ఆర్మూర్​ లో మున్సిపల్​ ఎన్నికలపై దిశ నిర్ధేశం చేసిన కలెక్టర్
  • డిస్ట్రిబ్యూషన్​, పోలింగ్​ కేంద్రాల పరిశీలన

ఆర్మూర్, వెలుగు: గందరగోళానికి తావు లేకుండా మున్సిపల్​ ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి ఎన్నికల అధికారులకు సూచించారు. సోమవారం ఆర్మూర్​ లోని డిగ్రీ కాలేజ్​ ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్​ కేంద్రాన్ని, టౌన్​ లోని పోలింగ్​ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్​ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహణ పై అధికార యంత్రాగానికి దిశా నిర్ధేశం చేశారు.

డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించి, తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, షామియానలు ఇతర వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సిబ్బందికి పోలింగ్ సామగ్రిని పక్కాగా అందించాలని, చెక్ లిస్టు ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి అందిందా, లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని చెప్పారు.

సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు.  బీఎల్ వోలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటరు సమాచార వివరాలతో కూడిన స్లిప్పులను వంద శాతం పంపిణీ చేసేలా పర్యవేక్షణ చేయాలన్నారు. ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు పోలింగ్​ కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని, ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని అన్నారు.     కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్​ మాల్వియ, స్థానిక అధికారులు ఉన్నారు.