
పాలమూరులోని పిల్లలమర్రిలో సోమవారం సాయంత్రం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో కలెక్టర్ విజయేందిర బోయి, మహిళలు, ఉద్యోగినులు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మ పాటలపై నృత్యాలు చేస్తూ, కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. మున్సిపల్ మహిళా కార్మికులు, ఉద్యోగినులు, యువతులతో కలిసి కలెక్టర్ నృత్యాలు చేస్తూ జోష్ నింపారు.
మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవానికి, వారసత్వ సంపద, ఉద్యమ స్ఫూర్తికి బతుకమ్మం పండుగ ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఏఎంసీ చైర్ పర్సన్ అనిత మధుసూదన్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, లైబ్రరీ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, వినోద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. - మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు