పెట్రోల్, డీజిల్ను బ్లాక్ చేస్తే కఠిన చర్యలు : జనగామ, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లు

పెట్రోల్, డీజిల్ను బ్లాక్ చేస్తే కఠిన చర్యలు : జనగామ, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లు

జనగామ/ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పెట్రోల్, డీజిల్​ను బ్లాక్​ మార్కెట్​కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జనగామ, భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్లు సందీప్​కుమార్​ఝా, అంకిత్​ హెచ్చరించారు. ఆయా జిల్లాల కలెక్టరేట్లలో గురువారం నిర్వహించిన సమావేశాల్లో వారు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని, ఎవరికైనా క్యాన్లలో ఎక్కువగా విక్రయిస్తే బంకులపై చర్యలు తీసుకుంటామన్నారు. 

అనంతరం జనగామ కలెక్టర్​నిర్వహించిన మీటింగ్​లో జిల్లాలోని అన్ని స్వయం సహాయక సంఘాలు తప్పనిసరిగా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. ఆయా సమావేశాల్లో వివిధ శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు.