
- లోపల..బయట.. కారిడార్లలో చెత్తకుప్పలు
- టీ కప్పులు, పావురాల రెట్టలు
- కూర్చోవడానికి కనిపించని కుర్చీలు
- అధికారులు, సిటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ కలెక్టరేట్ చెత్తకుప్పలా మారింది. లక్డీకపూల్‌లోని స్నేహ సిల్వర్‌జూబ్లీ భవన్‌లోని కలెక్టరేట్ లో లోపల, బయట, కారిడార్లలో ఏ మూలన చూసినా, ఎటూ చూసినా చెత్తే కనిపిస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్‌లోని లిఫ్ట్ పరిసరాలు చెత్త, గుట్కా మరకలు, తాగేసిన టీ కప్పులు, పావురాల రెట్టలతో నిండిపోయాయి. బిల్డింగ్ పై అంతస్తుల్లోని ఆఫీసుల ముందు మాత్రమే శుభ్రంగా కనిపిస్తుంది. భవనానికి కుడివైపున పార్కింగ్ ఏరియాలో చెత్త డబ్బాలు నిండిపోగా ఓపెన్ఏరియాలో పడేస్తుండగా చెత్త గుట్టగా తయారైంది.
కారిడార్లు, గోడల చుట్టూ పనికిరాని వస్తువులు, పగిలిపోయిన పూల కుండీలు, పాడైన ఫర్నిచర్ వదిలేయగా చిన్నపాటి డంపింగ్ యార్డ్‌ను తలపిస్తుంది. స్నేహ బిల్డింగ్ ను నెలకోసారి కూడా క్లీన్చేయరని, చెత్తను వారాల తరబడి తీసుకెళ్లరని కలెక్టరేట్లోని ఓ అధికారి చెప్పారు. అయితే పక్కనే స్ఫూర్తి భవన్లో కలెక్టర్ ఆఫీసు ఉంటుంది. అదే బిల్డింగ్ లో మంత్రులు సమీక్షలు కూడా నిర్వహిస్తుంటారు. పక్కనే స్నేహ బిల్డింగ్‌ను మాత్రం అధికారులు పట్టించుకోకపోవడంపై కలెక్ట
రేట్‌కు వచ్చిన ప్రజలు విమర్శలు చేస్తున్నారు. ఓల్డ్ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ను కొంగరకలాన్ లోని కొత్త బిల్డింగ్ లోకి తరలించాక.. ఇందులోకి కొద్ది నెలల కిందట హైదరాబాద్ కలెక్టరేట్‌ను షిఫ్ట్ చేసిన సంగతి తెలిసిందే.
జిల్లా ఆఫీసులన్నీ ఇక్కడే..
4 అంతస్తులు ఉన్న స్నేహ సిల్వర్ జూబ్లీ భవన్ లో హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన పలు ఆఫీసులు ఉన్నాయి. జిల్లా స్త్రీ, శిశు, ట్రైబల్ వెల్ఫేర్, స్పెషల్ఎగ్జిక్యూటివ్మేజిస్ట్రేట్, అడల్ట్ఎడ్యుకేషన్, ల్యాండ్అక్విజేషన్స్పెషల్ఆఫీస్, పబ్లిక్ రిలేషన్ఆఫీస్, అర్బన్ ల్యాండ్‌సీలింగ్, సర్వే ల్యాండ్ రికార్డ్స్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్, షెడ్యూల్డ్క్యాస్ట్ డెవలప్మెంట్ సొసైటీ, యూత్, స్పోర్ట్స్ తదితర ఆఫీసులు ఉన్నాయి. రోజూ వందల సంఖ్యలో ప్రజలు తమ పనులపై ఆఫీసులకు వస్తుంటారు. ‘గవర్నమెంట్ ఆఫీస్‌లా లేదు. ఏదో భూత్ బంగ్లాలా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో కూర్చునేందుకు కనీసం కుర్చీలు కూడా లేవు’ అని ట్రైబల్ఆఫీసుకు వచ్చిన ఓ వ్యక్తి అసహనం వ్యక్తంచేశారు. కాగా, నాంపల్లి ఉన్న హైదరాబాద్ కలెక్టరేట్‌ను గతేడాది లక్డీకాపూల్‌కు మార్చారు. కలెక్టరేట్లో స్ఫూర్తి, స్నేహ అనే రెండు భవన సముదాయాలు ఉన్నాయి.
ఎవరూ పట్టించుకోవట్లే..
“స్నేహ సిల్వర్ జూబ్లీ భవన్ ను నెలకు ఒక్కసారి కూడా క్లీన్ చేయరు. వారాల తరబడి చెత్తను తీసుకెళ్లరు. సాయంత్రమైతే దోమలు విజృంభిస్తున్నాయి. కొన్నిసార్లు సెకండ్ గేట్‌నుంచి బయటి వాటర్లోపలికి వచ్చి బిల్డింగ్ముందు నడవడానికి కూడా వీలు లేకుండా ఉంటుంది. ఇక వానాకాలంలో పరిస్థితిఇంకా దారుణంగా ఉంటుంది. అధికారులకుపక్కన ఉన్న స్ఫూర్తి భవన్ మీద ఉన్న శ్రద్ధ స్నేహభవన్ మీద లేదు. ఆ బిల్డింగ్‌లో కలెక్టర్ఉంటారు కాబట్టి క్లీన్‌గా ఉంటుంది. ఇక్కడ అంతా కిందిస్థాయి అధికారులుఉంటారు.కాబట్టి ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎవ రువస్తారో, వెళ్తారో తెలియదు. ఈ బిల్డింగ్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి” అని ఓ అధికారి పేర్కొన్నారు.