కాలేజీలే తెర్వలే.. అప్పుడే ఫీజుల బాదుడు!

కాలేజీలే తెర్వలే.. అప్పుడే ఫీజుల బాదుడు!
  • 10 నుంచి 20 శాతం పెంచేసిన కార్పొరేట్ సంస్థలు
  • మాయమాటలు చెప్పి ముందు అడ్మిషన్లు..
  • ఇంటికే వచ్చి అడ్మిషన్లు తీసుకుంటున్న కాలేజీల సిబ్బంది
  • తర్వాత 40 శాతం ఫీజు కట్టాలని ఒత్తిళ్లు
  • పేరెంట్స్​కు తరచూ ఫోన్లు, మెసేజ్‌లు
  • ప్రభుత్వ ఉత్తర్వులు కూడా రాకముందే కాలేజీల దందా

హైదరాబాద్, వెలుగు: కాలేజీలు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియదు. కానీ ఇప్పటి నుంచే అడ్మిషన్లు మొదలుపెట్టాయి కార్పొరేట్ సంస్థలు. ఫీజుల కోసం పేరెంట్స్​ను వేధిస్తున్నాయి. మాటలతో ముందు మాయ చేసి పేరెంట్స్​ను అడ్మిషన్లకు ఒప్పించి.. తర్వాత ఫీజులు కట్టాలని ఒత్తిడి తెస్తున్నాయి.  ‘‘లక్షల మంది స్టూడెంట్స్ టెన్త్ పాస్ అయ్యారు. లేట్ చేస్తే సీట్ దొరకదు. ఇక మీ ఇష్టం” అంటూ కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు వెనుకాముందు ఆలోచించకుండా చేర్పిస్తున్నారు. తీరా పిల్లలను చేర్చాక మొత్తం ఫీజులో 40 శాతం కట్టాలని ఒత్తిడి చేస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు కూడా ఇంకా రాకముందే ప్రైవేట్, కార్పొరేటు కాలేజీలు దందా చేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే 10 నుంచి 20 శాతం ఫీజులు పెంచేసి మరీ వసూలు చేస్తున్నాయి.