రంగుల జీవో రద్దు- ఏపీ సర్కార్‌కు హైకోర్టు మరో షాక్

రంగుల జీవో రద్దు- ఏపీ సర్కార్‌కు హైకోర్టు మరో షాక్

అమరావతి: పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడంపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 623 జీవోను క్యాన్సిల్ చేసింది హైకోర్టు. ప్రభుత్వ కార్యాలయాలపై ఉన్న పార్టీ రంగులను తొలగించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తే.. ప్రభుత్వం మరో రంగును అదనంగా వేయడం.. కోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని సోమయాజులు అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కార్యాలయాలకు వేస్తున్న రంగులు వైసీపీ జెండాను పోలి ఉన్నాయని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు.

హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ప్రభుత్వం పాటించడంలేదని తెలిపారు. దీంతో ప్రభుత్వం వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ప్రభుత్వం పాటించలేదని తెలిపింది. దీనికి సంబంధించిన జీవోను రద్దు చేస్తూ..సీఎస్, సీఈసీ పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై కోర్టు దిక్కారం కింద సుమోటోగా కేసు తీసుకుంటామని తెలిపిన హైకోర్టు..  మే- 28లోపు వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇదే విషయంపై ఏపీ ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. ప్రస్తుతం ఉన్న 3 రంగులకు అదనంగా వేస్తున్న రంగు పార్టీ రంగు కాదని తెలిపారు.