ప్రమాణ స్వీకారానికి రండి: మోడీకి జగన్ ఆహ్వానం

V6 Velugu Posted on May 26, 2019

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ(ఆదివారం) ఢిల్లీలో ప్రధాని మోడీని కుసుకున్నారు. ఈనెల 30వ తేదీన సీఎంగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీ చేరుకున్నజగన్‌ నేరుగా లోక్‌కల్యాణ్‌మార్గ్‌లోని ప్రధాని నివాసానికి వెళ్లారు. సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించిన మోడీని అభినందించిన తర్వాత… తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాల్సింది ఆహ్వానించారు. ఈ సందర్భంగా విభజన హామీలు, ప్రత్యేక హోదా, రాష్ట్ర సమస్యలను ఆయన ప్రధాని దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. జగన్‌ వెంట సీఎస్‌ ఎల్‌.వి. సుబ్రహ్మణ్యం, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, పలువురు లోక్‌సభ సభ్యులు ఉన్నారు.

Tagged modi, jagan, Invitation, Come to swear

Latest Videos

Subscribe Now

More News