గవర్నర్‌ తమిళిసైను కలిసిన అలీ

గవర్నర్‌ తమిళిసైను కలిసిన అలీ

ప్రముఖ సినీ నటుడు అలీ తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్ను రాజ్భవన్లో  మర్యాదపూర్వకంగా కలిశారు. అలీ పెద్దకూతురు ఫాతిమా వివాహం ఇటీవలే నిశ్చయమైంది.  ఈ సందర్భంగా వివాహ ఆహ్వాన పత్రిక ప్రతికను  గవర్నర్‌ కు అందజేసి వివాహానికి  రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. పెళ్లిపత్రికను  స్వీకరించిన తమిళిసై తప్పకుండా వివాహానికి హాజరవుతానని అలీకి మాటిచ్చారు. 

అలీకి మొత్తం ముగ్గురు సంతానం కాగా ఫాతిమా పెద్దకూతురు. మెడిసిన్ కంప్లీట్  చేసిన ఫాతిమా ఎంగేజ్మెంట్ ఇటీవలే గ్రాండ్ గా జరిగింది. దీనికి టాలీవుడ్ సినీ ప్రముఖులు హజరయ్యారు. షేక్ షెహ్యాజ్ అనే వ్యక్తితో ఫాతిమా  పెళ్లి త్వరలో జరగనుంది. షేక్ షెహ్యాజ్ డాక్టర్ గా పనిచేస్తున్నాడు.