ఇండోనేషియాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా స్టార్ లూలా లఫా (26) మృతి చెందారు. ఇండోనేషియాలో అత్యంత ప్రజాదరణ పొందిన కంటెంట్ క్రియేటర్ అయినా లూలా లఫా ఈరోజు (23 జనవరి 2026) అపార్ట్‌మెంట్‌లో చనిపోయి కనిపించారు. ఈ వార్త ఇటు సోషల్ మీడియాను, అటు ఆమె కోట్లాది ఫాలోవర్స్ ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఏం జరిగిందంటే.. సౌత్ జకార్తాలోని ధర్మవాంగ్సా ప్రాంతంలో ఉంటున్న ఆమె తన అపార్ట్‌మెంట్‌లోనే చనిపోయి ఉనట్లు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. దింతో సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా భావించి విచారణ చేపట్టారు. ఆమె మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే మరణానికి కొన్ని వారాల ముందు ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. జనవరి 21న అంటే చనిపోవడానికి రెండు రోజుల ముందు కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఆక్టివ్‌గానే ఉన్నారు.
లూలా లఫా ఎవరు :
లూలా లఫాకి ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌లో 33 లక్షల కంటే పైగా మంది ఫాలోవర్లు ఉన్నారు. కేవలం అందం, లైఫ్ స్టయిల్ గురించే కాకుండా, ఆమె మంచి సింగర్ కూడా. మొదట పాటల ద్వారానే ఆమె పాపులర్ అయ్యారు. ఆమె ప్రియుడు ప్రముఖ మ్యూజిషియన్ రెజా ఆక్టోవియన్, లూలా లఫా మరణ వార్త తెలియగానే అతను తన మ్యూజిక్ షోలను క్యాన్సల్ చేసుకున్నారు. ప్రస్తుతానికి పోలీసులు ఆమె కుటుంబికులతో మాట్లాడుతున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే తప్ప ఆమె మరణానికి అసలు కారణం ఏంటనేది తెలియదు అంటున్నారు పోలీసుల. ఆమె మరణ వార్త తెలియగానే సోషల్ మీడియాలో అభిమానులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
