హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ ముగిసింది. శుక్రవారం (జనవరి 23) ఉదయం 11 గంటల నుంచి దాదాపు 7 గంటల పాటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన విరాళాలు, ఎలక్టోరల్ బాండ్లు.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొందరు వ్యాపారవేత్తలు, రాజకీయ నేతల ఫోన్ల ట్యాపింగ్‌కు సంబంధించి కేటీఆర్‌పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. అలాగే ఈ కేసులో నిందితుడు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, కేటీఆర్‌ను కలిపి గంట పాటు ఇన్విస్టిగేట్ చేసినట్లు సమాచారం.
సిట్ విచారణ అనంతరం కేటీఆర్ నేరుగా తెలంగాణ భవన్‌కు వెళ్లారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అగ్రనేతలు హరీష్ రావు, కేటీఆర్ విచారణ ముగియడంతో ఇక నెక్ట్స్ వంతు పెద్దాయనదే (కేసీఆర్) అని పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
►ALSO READ | మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు పక్కా: మంత్రి వివేక్ వెంకటస్వామి
తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు 2026, జనవరి 22 సిట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జూబ్లీహిల్స్ నందినగర్‌లోని కేటీఆర్ నివాసానికి వెళ్లి అధికారులు నోటీసులు అందజేశారు. 2026, జనవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇవాళ కేటీఆర్ సిట్ విచారణకు హాజరయ్యారు.
