- జూబ్లీహిల్స్ బై పోల్, సర్పంచ్ ఎన్నికలతో పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్
- ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించండి
- టికెట్ దక్కని వారికి భవిష్యత్తులో అవకాశాలుంటాయని హామీ
సంగారెడ్డి: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు పక్కా అని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చా ర్జి మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ బై పోల్, సర్పంచ్ ఎన్నికల తర్వాత పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చిందన్నారు. పటాన్ చెరు నియోజకవర్గం ముత్తంగి, జిన్నారం లో పర్యటించారు. ఇస్నాపూర్, ఇంద్రేశం, గుమ్మడి దల, జిన్నారం, గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
నియోజకవర్గంలో గ్రూపు రాజ కీయాలు లేవని, తాను చేయించిన సర్వేలో పార్టీ తప్పక విజయం సాధిస్తుందని తేలిందన్నారు. అభ్యర్థుల ఎంపిక సక్రమంగా జరగాలన్నారు. టికెట్ రాని వారు నిరాశ చెందవద్దని, అలాంటి వారికి భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారని, అందరూ కలిసి పార్టీ అభ్యర్థులను గెలిచింపుకో
వాలన్నారు.
కొత్త రేషన్ కార్డుల ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్న మంత్రి.. ఇండ్ల విషయంలో గత ప్ర భుత్వం ప్రజల్ని మోసం చేసిందని విమర్శించా రు. ప్రజల దగ్గరకు వెళ్ళినప్పుదు 6 గ్యారంటీల గురించి వివరించాలన్నారు. మహిళలకుకు పెట్రోల్ బంకులు శాంక్షన్ చేయిస్తామన్నారు. ఎదుటి పార్టీ విమర్శలకు గట్టి కౌంటర్అవ్వాలని సూచించారు. పఠాన్ చెరులో పోల్ మేనేజమెంట్ సరిగా లేక ఓడిపోయామన్నారు. కార్మికుల వైపే కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పారు.
