మీరు వేగంగా శ్వాస తీసుకుంటున్నారా ? జాగ్రత.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లేట్ చేయకండి..

మీరు వేగంగా శ్వాస తీసుకుంటున్నారా ? జాగ్రత.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లేట్ చేయకండి..

చాలామంది వేగంగా శ్వాస తీసుకోవడాన్ని అలసటనో, టెన్షనో అనుకుని వదిలేస్తారు. కానీ, ఎటువంటి కారణం లేకుండా శ్వాస వేగం పెరగడం అనేది గుండె పంపింగ్ బలహీనపడటానికి ఒక సంకేతం కావచ్చు.... అవును.. మన గుండె ఆరోగ్యంగా ఉన్నప్పుడు శరీరానికి కావలసిన ఆక్సిజన్‌ను రక్తం ద్వారా సులువుగా పంపిస్తుంది. కానీ గుండె బలహీనపడినప్పుడు శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదు.

దీన్ని భర్తీ చేయడానికి ఊపిరితిత్తులు వేగంగా గాలిని పీల్చుకుంటాయి. దీనివల్ల మనం శ్రమ పడకుండానే ఊపిరి వేగంగా తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా పడుకున్నప్పుడు కూడా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే, అది గుండె సమస్యకు ఒక సూచన కావొచ్చు.

గుండె జబ్బులకి సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి. ఎందుకంటే ఒకోసారి ఏ  క్షణాల్లోనైన మీరు ప్రమాదంలో పడొచ్చు...
*ఎంత రెస్ట్ తీసుకున్నా నీరసంగా అనిపించడం.
*కొంచెం దూరం నడిచినా లేదా చిన్న పని చేసినా త్వరగా అలసిపోవడం.
*గుండెలో ఏదో ఇబ్బందిగా లేదా భారంగా అనిపించడం.
*గుండె వేగంగా కొట్టుకుంటున్నట్లు  అనిపించడం.
*అప్పుడప్పుడు కళ్లు తిరగడం లేదా నీరసంతో కళ్లు బైర్లు కమ్మడం.
*కాళ్ల పాదాలు లేదా మడమలు దగ్గర వాపులు రావడం.

గుండె సమస్య ఎక్కువై  ప్రమాదం కలగకముందే మొదట్లోనే గుర్తిస్తే చికిత్స ఈజీ అవుతుంది. ఆధునిక వైద్యంలో వాల్వ్ రిపేర్, బైపాస్ సర్జరీ లేదా చిన్న చిన్న పరికరాల సహాయంతో గుండెను మళ్లీ ఆరోగ్యంగా మార్చవచ్చు.

గుండె జబ్బుల లక్షణాలలో శ్వాస ఆడకపోవడం ఒకటి. గుండె రక్తాన్ని సరిగ్గా పంప్ చేయలేకపోవడం వల్ల ఊపిరితిత్తుల రక్త నాళాలలో ఒత్తిడి పెరుగుతుంది. దింతో రక్తంలోకి ఆక్సిజన్ వెళ్లడం కష్టమవుతుంది. దీనివల్ల వేగంగా లేదా ఇబ్బందిగా శ్వాస తీసుకోవడం జరుగుతుంది.