త్రిగుణ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభమైంది. సూరిశెట్టి కిషోర్ దర్శకత్వంలో ‘ఆకర్షిత’ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. కోరె సందీప్ యాదవ్, శ్రీకాంత్ బట్టు కలిసి నిర్మిస్తున్నారు. పదినే కుమార్ హీరోయిన్‌గా నటించనున్న ఈ మూవీలో రాజ్ కుమార్ కసిరెడ్డి, అదుర్స్ రఘు, సత్యం రాజేష్, రవివర్మ, ప్రియా ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు.
శనివారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని స్టార్ట్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సి. కళ్యాణ్ క్లాప్ కొట్టగా, జ్యోతిష్యుడు వేణుస్వామి టీమ్‌కు స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా త్రిగుణ్ మాట్లాడుతూ ‘మంచి కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. అందర్నీ ఆకర్షించేలా మా చిత్రం ఉంటుంది’ అని అన్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నట్టు దర్శక నిర్మాతలు తెలియజేశారు.
