గుక్క తిప్పుకోకుండా సంస్కృతంలో క్రికెట్ కామెంటరీ

గుక్క తిప్పుకోకుండా సంస్కృతంలో క్రికెట్ కామెంటరీ

ఇండియాలో క్రికెట్కు ఉండే క్రేజే వేరు. ఇక్కడ ఇతర క్రీడలేమో కానీ..క్రికెట్ను మాత్రం ఇష్టపడని వారు ఉండరేమో. అందుకే భారత్లో క్రికెట్ను ఓ మతంలా భావిస్తారు. అందుకే మ్యాచ్ ఏదైనా..అభిమానులు క్రికెట్ను మాత్రం చూడటం మానేయరు. ఇక క్రికెట్లో కామెంటరీకి ప్రత్యక స్థానముంది. క్రికెట్ ఆటకు మజా దక్కాలంటే అది కామెంటరీతోనే. కామెంటరీ లేని క్రికెట్ను ఊహించుకోలేము. 

సాధారణంగా క్రికెట్ కామెంటరీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. మనదేశంలో హిందీలోనూ క్రికెట్ కామెంటరీ వినొచ్చు. ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగులోనూ కామెంటరీ వినిపిస్తున్నారు. అయితే ఈ కామెంటరీ సంస్కృతంలోనూ వినే అవకాశం ఉంది.

బెంగళూరు నగరంలోని గిరినగర్‌ ప్రాంతంలో  గల్లీక్రికెట్‌ ఆడుతుండగా..సంస్కృతంలో కామెంటరీ చేశారు. యువకులు కలిసి క్రికెట్ ఆడుతున్న సమయంలో ఓ వ్యక్తి గుక్క తిప్పుకోకుండా సంస్కృతంలో కామెంటరీని వినిపించాడు. మంత్రాలు చదివినట్టు నాన్ స్టాప్..ప్రతీ బంతి గురించి వివరించాడు. సంస్కృతంలో క్రికెట్ కామెంటరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

మోడీ ఫిదా
సంస్కృత కామెంటరీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీక్షించారు. ఆ వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. సంస్కృతంలో కామెంటరీ చెప్పిన యువకుడిని ప్రధాని మోడీ ప్రశంసించారు. 

ఆకట్టుకుంటున్న వీడియో..
వేద మంత్రాల్లా ఉన్న ఈ సంస్కృత క్రికెట్ కామెంటరీ నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. 45 సెకండ్లు మాత్రమే ఉన్న ఈ వీడియోను ఇప్పటికే 6 .61 లక్షల మంది చూశారు. ఈ కామెంటరీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్లోనూ సంస్కృతంలో కామెంటరీ చెప్పించాలని కోరుతున్నారు.