గుడ్ న్యూస్: కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు

గుడ్ న్యూస్: కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు

కమర్షియల్ వంట గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్. గత కొంతకాలంగా పెరుగుతూ వచ్చిన కమర్షియల్ వంట గ్యాస్ ధరలు.. కొత్త ఆర్థిక సంవత్సరంలో తొలి రోజే ధరలను స్పల్పంగా తగ్గిస్తూ చమురు సంస్థలు  నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు  ఏప్రిల్ ఒకటో తేదీన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటనలో తెలిపాయి.

19కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.30.50 తగ్గించింది.  తాజా తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1764.50కు చేరింది. అంతుకుముందు ఈ  సిలిండర్ రూ.1795గా ఉండేది. ఇక, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.1,710, కోల్‌కతాలో రూ.1,868.50, చెన్నైలో రూ. 1,929లుగా ఉంది. 

కాగా, 14.2కేజీల డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు.  మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్ ధరపై కేంద్ర ప్రభుత్వం రూ.100 తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఈ సిలిండర్ ధర రూ.903గా ఉంది.