జోగిపేట హాస్పిటల్ను ఆదర్శంగా మార్చాలి : అజయ్కుమార్

జోగిపేట హాస్పిటల్ను ఆదర్శంగా మార్చాలి : అజయ్కుమార్

జోగిపేట,వెలుగు: జోగిపేట హాస్పిటల్​ను ఆదర్శంగా మార్చాలని వైద్యవిధాన పరిషత్​ కమిషనర్​అజయ్​కుమార్​ సిబ్బందిని ఆదేశించారు. శనివారం ఆయన జోగిపేట హాస్పిటల్​ను తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఆస్పత్రిలో వైద్య సేవలు మెరుగు పర్చాలన్నారు. సాధారణ డెలివరీలను పెంచాలన్నారు. ఎలాంటి  సమస్యలున్నా తనకు చెబితే మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని చెప్పారు. 

డెంటల్​ విభాగంలో కొత్త ఎక్విప్​మెంట్​వస్తున్నట్లు పేర్కొన్నారు.  అవసరమైతే ఇతర ప్రాంతాల నుంచి వైద్యులను ఇక్కడికి షిప్ట్​ చేస్తామన్నారు. ఆక్సిజన్​ ప్లాంటు అందుబాటులో ఉందన్నారు. గత నెల 9న  కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మికంగా తనిఖీ చేయగా 11 మంది వైద్యులు గైర్హాజరు అయిన విషయం తెలిసిందే. వారికి షోకాజ్​ నోటీసులు జారీ చేశారు. కమిషనర్​ వెంట హాస్పిటల్​ సూపరింటెండ్ డాక్టర్​ సౌజన్య ఉన్నారు.