వీధి కుక్కలకు వ్యాక్సిన్​ వేయాలి : రోనాల్డ్ రోస్

వీధి కుక్కలకు వ్యాక్సిన్​ వేయాలి : రోనాల్డ్ రోస్
  • బల్దియా కమిషనర్​ రోనాల్డ్ రోస్

హైదరాబాద్​, వెలుగు : వీధి కుక్కల బెడద తగ్గించేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపడుతోందని కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. మంగళవారం హెడ్డాఫీసులో అడిషనల్ కమిషనర్ రవి కిరణ్, వెటర్నరీ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. వీధి కుక్కలకు స్టెరిలైజేషన్, యాంటీ బర్త్ కంట్రోల్ చర్యలు తీసుకుంటున్నట్లు ​తెలిపారు. వీధి కుక్కలకు రెగ్యులర్​గా వ్యాక్సిన్ వేయాలని సూచించారు.

కుక్కల దాడులపై అధ్యయనం చేయాలన్నారు. నాన్​వెజ్​షాపుల వ్యర్థాలను ఖాళీ స్థలంలో పారవేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఫీడర్ స్వచ్ఛంద సంస్థల రిజిస్ట్రేషన్, కమ్యూనిటీ అడాప్షన్ పై డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలన్నారు. వెటర్నరీ చీఫ్ డా.అబ్దుల్ వకీల్, బ్లూ క్రాస్ సంస్థ ప్రతినిధులు అక్కినేని అమల, కుమారి, పీపుల్ ఫర్ యానిమల్స్ ప్రతినిధి వి.వాసంతి, యానిమల్​ఎయిడ్ సొసైటీ ప్రతినిధి అర్చన నాయుడు  పాల్గొన్నారు.