
శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రంలో గురువారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో తొమ్మిది మంది సిబ్బంది మరణించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఐడీ ఈ ఘటనపై విచారణ ప్రారంభించింది. ఈ ఘటన పై టీఎస్ ఎస్పీడిసిఎల్ సిఎండి రఘుమా రెడ్డి అధ్యక్షతన 4గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు. సభ్యులుగా జేఎండి శ్రీనివాసరావు, ట్రాన్స్మిషన్ డైరెక్టర్ జగత్ రెడ్డి , టీఎస్ జెన్కో ప్రాజెక్టు డైరెక్టర్ సచ్చిదానందం, కన్వీనర్ రత్నాకర్ ఉన్నారు. సీఐడీతో సంబంధం లేకుండా వీరు ప్రత్యేక దర్యాప్తు చేయనున్నారు. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ట్రాన్స్ కో ,జెన్కో సిఎండి ప్రభకార్ రావు వీరిని అదేశించారు.