పాలమూరు పర్యావరణ అనుమతులపై కమిటీ

పాలమూరు పర్యావరణ అనుమతులపై కమిటీ

హైదరాబాద్, వెలుగు:పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్​స్కీమ్ కు పర్యావరణ అనుమతులపై తేల్చేందుకు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఎక్స్ పర్ట్​అప్రైజల్​కమిటీ తుదిదశ పర్యవరణ అనుమతులకు గ్రీన్​సిగ్నల్​ఇచ్చినా, ఈ ప్రాజెక్టులో పర్యావరణ ఉల్లంఘనల అంశం అడ్డంకిగా మారింది. ఉల్లంఘనలపై ఎన్జీటీ విధించిన జరిమానాకు సంబంధించిన నిధులు ఎలా వినియోగిస్తారో పర్యవేక్షించడానికి కేంద్రం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది.

పాలమూరు లిఫ్ట్​స్కీమ్ కు తుదిదశ పర్యావరణ అనుమతులు ఇస్తూ ఈఏసీ ఆగస్టు 10న సిఫార్సు చేసినా ఆ ప్రపోజల్​కు కేంద్రం ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు. పాలమూరు లిఫ్ట్​స్కీమ్ లో పర్యావరణ ఉల్లంఘనలపై ఏపీలోకి కడప జిల్లాకు చెందిన పలువురు ఎన్జీటీని ఆశ్రయించారు. ఈ ప్రాజెక్టులో రిజర్వాయర్ల నిర్మాణంతో రూ.3.7 కోట్ల మేరకు పర్యావరణానికి నష్టం వాటిల్లిందని ఎన్జీటీ నియమించిన కమిటీ నిర్దారించింది. ఎన్జీటీ పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్​స్కీంకు రూ.600 కోట్లు, డిండి ఎత్తిపోతలకు రూ.320 కోట్ల జరిమానా విధించింది. ఈ జరిమానా మొత్తాన్ని ఎలా ఖర్చు చేస్తున్నారో నిర్దారించడానికి ఎక్స్​పర్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ పాలమూరుకు పర్యావరణ తుది అనుమతులు ఇవ్వనుంది.