కమ్యూనిటీ నాయకులకు.. ‘కమ్యూనిటీ ఛాంపియన్స్‌’ పురస్కారం

కమ్యూనిటీ నాయకులకు.. ‘కమ్యూనిటీ ఛాంపియన్స్‌’ పురస్కారం

ఎల్బీనగర్‌, వెలుగు: ఆరోగ్యకరమైన సమాజం కోసం కృషి చేస్తున్న కమ్యూనిటీ నాయకులను కామినేని హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో ఆదివారం ‘కమ్యూనిటీ ఛాంపియన్స్‌’గా సత్కరించారు. నగరంలోని 50కి పైగా గేటెడ్‌, రెసిడెన్షియల్‌ కమ్యూనిటీల అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ‘కమ్యూనిటీ హెల్త్‌ ప్రివిలేజ్‌ కార్డు’ను ప్రారంభించారు. కార్యక్రమానికి 150 మంది కమ్యూనిటీ ప్రతినిధులు హాజరయ్యారు. కామినేని హాస్పిటల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్​ గాయత్రి కామినేని, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ డాక్టర్​ గోకుల్‌ రఘురామ్‌, సత్యనారాయణ ఏఆర్‌ఎస్‌ పాల్గొన్నారు.