విజయ్ కేసు.. ఫిర్యాదుదారుడి స్టేట్మెంట్ రికార్డ్

విజయ్ కేసు.. ఫిర్యాదుదారుడి స్టేట్మెంట్ రికార్డ్

గచ్చిబౌలి, వెలుగు: టాలీవుడ్ యాక్టర్​ విజయ్ దేవరకొండపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు విషయంలో ఫిర్యాదుదారుడి స్టేట్మెంట్ ను సైబరాబాద్ పోలీసులు రికార్డ్ చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న మాదాపూర్ ఏసీపీ శ్రీధర్ శుక్రవారం తన ఆఫీస్ లో ఫిర్యాదుదారుడు గిరిజన సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్ నాయక్ నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఏప్రిల్​ 26న తమిళ హీరో సూర్య నటించిన రెట్రో సినిమా ఫ్రీ రిలీజ్ లో విజయ్​ దేవరకొండ గిరిజనులను కించపరిచేలా మాట్లాడారంటూ కేసు పెట్టారు.