జీహెచ్ఎంసీ ఉద్యోగులపై ఈసీ కొరడా

జీహెచ్ఎంసీ  ఉద్యోగులపై ఈసీ కొరడా

ఎన్నికల విధులకు హాజరుకాకండా నిర్లక్ష్యం వహిస్తున్న జీహెచ్ఎంసీ  ఉద్యోగులపై  ఈసీ కొరడా ఝలిపించింది.  పలుమార్లు అదేశించినప్పటికి జీహెచ్ఎంసీ పరిధిలో వివిధ శాఖలలో పని చేస్తున్న ఉద్యోగులు ఎన్నికల విధులకు గైర్హాజరయ్యారు. ఈ క్రమంలో ఈసీ చర్యలు చేపట్టింది.   40 మంది ఉద్యోగులపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు  జీహెచ్ఎంసీ అడిషనల్ ఎలక్షన్ కమిషనర్ మంగతాయారు. ఆమె ఫిర్యాదు మేరకు 40 మంది ఉద్యోగుల పై సెక్షన్ 134 కింద కేసు నమోదు చేశారు సైఫాబాద్ పోలీసులు.  

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌తో పాటు కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, అత్యంత పారదర్శకంగా నిర్వహించడానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ తెలిపారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టితో కలిసి ఎన్నికల ఏర్పాట్లపై మాట్లాడారు.