
హైదరాబాద్: ఓ కేసు విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారని SR నగర్ పోలీసులపై HRCకి ఫిర్యాదు చేశారు బాధితులు. రెండు రోజుల క్రితం బోరబండలో జరిగిన ఘర్షణకు కారకుడైన రౌడీ షీటర్ షెరీఫ్ నుకఠినంగా శిక్షించాలని SR నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాధితులు. అయితే రెండు రోజులైనా కేసును పట్టుంచుకోకపోవడంతో SR నగర్ పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ గురువారం రాష్ట్ర మానవ హక్కుల కమీషన్(HRC)ని ఆశ్రహించారు బాధితులు. అక్టోబర్ 1వ తేదీన రౌడీ షీటర్ షెరీఫ్ తన భర్త షాలిపై విచక్షణా రహితంగా దాడి చేసాడని HRCలో ఫిర్యాదు చేశారు.
తన భర్త ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే ..SR నగర్ పోలీసులు నామమాత్రంగా కేసుపెట్టి ఒక్క రోజులోనె బెయిల్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బాధిత మహిళ. బయటకి వచ్చిన రౌడీ షీటర్ షెరీఫ్ తమ కుటుంబ సభ్యులను చంపుతానని సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి ప్రాణ రక్షణ కల్పించి, రౌడీ షీటర్ కు కొమ్ముకాస్తున్న SR నగర్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని HRCని వేడుకున్నారు బాధిత మహిళ.