చట్ట సవరణకు నడుం బిగించిన కేంద్రం

చట్ట సవరణకు నడుం బిగించిన కేంద్రం

న్యూఢిల్లీ: బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్‌‌ (ఐపీసీ), సీఆర్‌‌పీసీని సవరించేందుకు కేంద్రం నడుం బిగించింది. ఈ దిశగా చర్యలను ప్రారంభించింది. ఐపీసీ, సీఆర్‌‌పీసీని సవరించేందుకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలంటూ రాష్ట్రాలను కేంద్ర సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి కోరారు. మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చట్టాలు రూపొందించడంతోపాటు మౌలిక సదుపాయాల ఏర్పాట్ల దిశగా  కసరత్తులు చేస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.

‘గొప్ప సంస్కృతి, వారసత్వ సంపద భారత్ సొంతం. మహిళలను గౌరవించడం మన కల్చర్‌లో ఉంది. మహిళల పవర్‌‌ను శక్తిగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. మహిళలను ఇంతగా గౌరవించే సంస్కృతి మరెక్కడా కనిపించదు. ఇక చట్టాల విషయానికొస్తే.. క్రిమినల్ లా యాక్ట్, 2018 ప్రకారం 12 ఏళ్లలోపు బాలికలపై రేప్ లేదా గ్యాంగ్ రేప్‌‌కు పాల్పడితే యాంటిస్పేటరీ బెయిల్ ఉండదు. వాళ్లకు డెత్ పెనాల్టీ ఉంటుంది. ఇలాంటి నేరాల్లో దర్యాప్తు, ట్రయల్స్‌‌ను రెండు నెలల్లోనే పూర్తి చేయాలి. మహిళల సేఫ్టీ కోసం ఇలాంటి మరిన్ని చట్టాలను తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. ప్రతి పోలీస్ స్టేషన్‌‌లో మహిళల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించాం’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.