విశాఖలో మత్స్యకారుల మధ్య ఘర్షణ

విశాఖలో మత్స్యకారుల మధ్య ఘర్షణ

విశాఖ సాగరతీరంలో మత్స్యకారుల మధ్య ఘర్షణ జరిగింది. రింగ్ వలలు ఉపయోగిస్తున్నారన్న కోపంతో ఓ వర్గం మత్స్యకారులు మరో వర్గంపై దాడులకు దిగారు. సముద్రంలో ఆరు పడవలకు నిప్పుపెట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. తీరానికి సమీపంలో రింగ్ వలలు ఉపయోగిస్తే.. సంప్రదాయ మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందనే అంశంపై ఎప్పటి నుంచో  వివాదం నడుస్తోంది. అయితే నిన్న  మంగమారిపేట, చేపలుప్పాడ, వాసవానిపాలెం, జాలరి ఎండాడ గ్రామాలకు చెందిన కొందరు రింగ్ వలలతో సముద్రంలోకి వెళ్లారు. సమాచారం అందుకున్న పెదజాలరిపేటకు చెందిన మత్స్యకారులు.. వారి వేటను అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఘటనలో ఏడుగురు మత్స్యకారులు గాయపడ్డారు. మత్స్యకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. గొడవను సద్దుమణిచేందుకు సాగరతీరంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు.

For More News..

మే నెల నుంచి కరెంట్​బిల్లులు భారీగా పెంపు

ట్రాఫిక్ చలాన్లతో కోట్ల ఆదాయం